09-09-2025 12:52:53 AM
మంచిర్యాల, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి) : బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లిని నియమిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకి, రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుకి రఘునాథ్ అభినందనలు తెలిపారు.