calender_icon.png 10 September, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

09-09-2025 12:54:33 AM

నిర్మల్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎటువం టి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో డబు ల్ ఓటర్లు ఉండకుండా చర్యలు చేపడతామని, ఒకరు ఒకటి కంటే ఎక్కువ కేంద్రాల్లో ఓటరు గా ఉన్నట్లయితే వెంటనే తొలగిస్తామని స్పష్టం చేశారు.

జిల్లాలో మొత్తం 4,49,302 మంది ఓటర్లు ఉన్నారని, వారి సౌకర్యార్థం 892 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్క బూత్‌లో 700, 800 మంది కి మించి ఓటర్లు ఉంటే అదనపు పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించా రు. ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకురావాలని పార్టీ ప్రతి నిధులను కోరారు.

రాజకీయ పార్టీ ప్రతినిధులు లేవనెత్తిన అనేక అంశాలపై అధికారు లు సమాధానమిచ్చారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్నకళ్యాణి, జెడ్పి సీఈవో గోవింద్, డిపిఓ శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.