calender_icon.png 30 October, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం

30-10-2025 12:34:32 AM

తూప్రాన్, అక్టోబర్ 29 :మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి అడవి ప్రాంతంలో ఒక కొండ పైన చిరుత సంచారం చేస్తుందని వ్యవసాయ దారులు తెలిపారు. గతంలో గుండ్రెడ్డిపల్లి గ్రామ పరిధిలోని అడవి ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరికి కనపడినట్లు తెలిపారు.

అయితే బుధవారం ఉదయం అడవి ప్రాంతంలో ఉన్న పొలాల వద్దకు వెళ్తుండగా కొందరు యువకులు కొండపై పడుకున్న చిరుతను చూసి గ్రామంలోని పలువురికి తెలియజేశారు. ముఖ్యంగా అడవి ప్రాంత అధికారులు తక్షణమే చిరుతను అదుపులోకి తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.