400 కోట్ల ఏండ్ల క్రితమే నీరు
14-06-2024 12:05 AM
న్యూఢిల్లీ, జూన్ 13: భూమిపై దాదాపు 400 కోట్ల ఏండ్ల క్రితమే నీరు ఏర్పడిందని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూఏఈకి చెందిన ఖలీఫా యూనివర్సిటీ, కర్టిన్ యూనివర్సిటీకి చెంది న స్కూల్ ఆఫ్ ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా భూమిపై నీటి జననం గురించి పరిశోధనలు చేశారు. జిర్కాన్ ఖనిజంలోని అత్యంత సూక్ష్మమైన ఆక్సిజ న్ ఐసోటోప్‌ల వయసుపై అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు.






