నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి
19-08-2026 12:00 AM
చిన్నంబావి, ఆగస్టు 18: నీటి కొరతను అధిగమించేందుకు రైతులు పొలాల్లో నీటి కు ంటలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజాపాలన ప్రాజెక్టు అధికారి పద్మ సూచించారు. బెక్కెం గ్రామంలో రైతు శివయ్య ఏర్పాటు చేసిన 12స12 మీటర్ల నీటి కుంటను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకుని అత్యవసర సమయంలో పంటలకు వినియోగించుకోవడం తో పాటు భూగర్భ జలాల పెంపునకు ఇవి దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి రఘునాథ్ రెడ్డి, ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






