19 June, 2026 | 4:10 PM

పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ అందజేత

19-06-2026 02:24 PM

సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన వెంకటాపూర్ సర్పంచ్

నంగునూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు గ్రామ సర్పంచ్ రేకులపల్లి సంతోష్ రెడ్డి అభినందనీయమైన చొరవ చూపారు. ఆయన తన సొంత ఖర్చు రూ.20,000లతో పాఠశాలలో వాటర్ ప్యూరిఫయర్‌ను ఏర్పాటు చేయించి శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతోనే దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు సింగాబట్టు రామరాజు సర్పంచ్ చొరవను అభినందిస్తూ..ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ 'మన ఊరు - మన బడి'ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.