14-07-2025 01:07:36 AM
ఖమ్మం, జూలై 13 (విజయ క్రాంతి ):పాలేరు జలాశయం నుండి రెండో జోన్ కు నీటి విడుదలకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ఆదివారం రాత్రి పాలేరు యూటీ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఇర్రిగేషన్ అధికారులతో పనుల పురోగతి, నీటి విడుదలకు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఇర్రిగేషన్ అధికారుల సూచనల మే రకు సోమవారం ఉదయం నుండి నీటి విడుదలకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
మొదటగా 1200 నుండి 1300 వందల క్యూసెక్కుల మేర నీటి విడుదల చేయనున్నట్లు, క్రమ క్ర మంగా నీటి విడుదల పెంపుదల చేయనున్నట్లు మంత్రి అన్నారు. పాలేరు జలాశయం లో నీటి నిల్వ, పైనుండి ఇన్ ఫ్లో ఎంతమేర అవుతుంది వివరాలను ఇర్రిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూటీ పనులు రాత్రింబవళ్లు చేపట్టి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అ ధికారులను మంత్రి ఆదేశించారు.ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఇర్రిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులుఉన్నారు.