14-07-2025 01:10:18 AM
-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఘనంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) నగర కమిటీ మహాసభ
ఖమ్మం, జూలై 13 ( విజయ క్రాంతి);ఖమ్మం జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యను ము ఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నా గేశ్వరరావు పేర్కొన్నారు. టియూడబ్ల్యూజె(ఐజెయు) ఖమ్మం నగర మహాసభ జెడ్పీ స మావేశ మందిరంలో ఆదివారం నగర అధ్యక్షులు మైసా పాపారావు అధ్యక్షతన జరిగిం ది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడు తూ ప్రజాస్వామ్య విలువలకు భంగం కలింగించకుండా చేసే బాధ్యత జర్నలిస్టులకుంద న్నారు.
వాస్తవాలను ప్రజలకందించి వృత్తిని విలువను పెంపొందించుకోవాలన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జర్నలిస్టులతో తనకెంతో అనుబంధం ఉందన్నారు. వారి స మస్యలు తెలుసనని, తప్పకుండా ఖమ్మం జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిఎంను కలిసి స మస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకంలో జర్నలిస్టులను కూడా చేర్చాలని టియూడబ్ల్యూజె(ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాం నారాయణ కోరారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, టియూడబ్ల్యూజె(ఐజెయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా టేటి వేణుగోపాల్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సామినేని మురారి, ఎలక్ట్రానిక్ మీడియా రా ష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వనం వెంకటేశ్వ ర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, కోశాధికారి శి వానంద, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యద ర్శి కనకం సైదులు, సీనియర్ జర్నలిస్టు నలజాల వెంకట్రావ్, కెమెరామెన్ అసోసియే షన్ జిల్లా అధ్యక్షులు ఆలస్యం అప్పారావు, ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కమతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.