28 May, 2026 | 1:56 AM

బక్రీద్ పండుగ సందర్భంగా మసీదులకు నీటి సరఫరా చేయాలి

28-05-2026 12:00 AM

బీఆర్‌ఎస్ ముషీరాబాద్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ భక్తియార్

ముషీరాబాద్, మే 27 (విజయక్రాంతి): బక్రీద్ పండుగ  సందర్భంగా మసీదులలో పెద్ద ఎత్తున సామూహిక ప్రార్థలను చేసేందుకు ముస్లింలు తరలిరానుండడంతో ముషీరాబాద్ లోని మసీదులలో వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలని బీఆర్‌ఎస్ ముషీరాబాద్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ భక్తియార్, పార్టీసీనియర్ నాయకులు దీన్ దయాల్ రెడ్డి జలమండలి అధికారులను డిమాండ్ చేశారు.

బుధవారం ముషీరాబాద్ లోని చిలకలగూడ రిజర్వాయర్ కార్యాలయంలో జలమండలి డీజీఎం విష్ణువర్ధన్ ను కలిసి మసీదులకు నీటి సరఫరా చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  స్థానికంగా మసీదులు అధికంగా ఉన్నాయని బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు ముస్లీంలు పెద్ద ఎత్తున హాజరు కానుండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి సరఫరా చేయాలని కోరారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి ఉన్నతాధికారులకు సైతం విజ్ఞప్తి చేశారని డీజీఎంకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు జాఫర్ ఖాన్, మున్నా, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.