డంపింగ్ యార్డ్‌లో నీళ్ల ట్యాంకర్‌లు
20-05-2026 12:06 AM
- మంటలు ఆర్పీ పొగను నియంత్రించడంలో నిమగ్నం
- విజయక్రాంతి కథనానికి స్పందన
నల్లగొండ, మే 19 (విజయక్రాంతి) : నల్లగొండ మండల పరిధిలోని చందనపల్లిలో నల్గొండ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో నిరంతరం పొగ దట్టంగా వెలువడుతుండడంతో సోమవారం విజయక్రాంతి దినపత్రికలో ’పొగ చూరుతున్న నల్లగొండ’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. మంగళవారం డంపింగ్ యార్డ్ లో నీటి ట్యాంకర్లు పెట్టి మంటలార్పుతో పొగ రాకుండా నిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేశారు. ఎన్నికల హామీ మేరకు డంపింగ్ యార్డ్ ని ఇక్కడ నుండి తొలగించాలని సమీప గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






