31 July, 2026 | 9:38 AM

పల్లె పోరులో మేము సైతం

25-08-2024 12:12 AM
  1. పంచాయతీ ఎన్నికలపై యువత ఆసక్తి 
  2. ఓటరు జాబితాకు అధికారుల కసరత్తు 
  3. రిజర్వేషన్‌లపై తొలగని సందిగ్ధత

కొడంగల్, ఆగస్టు -24 (విజయక్రాంతి): త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పోటీల్లో నిలిచేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. అధికారులు గ్రామ పంచాయతీల వార్డు విభజన ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఎలక్టోరల్ రోల్స్‌కు సంబంధించిన ప్రక్రియను సెప్టెంబరు 6 నుంచి 21వరకు చేపట్టాలని తాజాగా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో గ్రామ స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది. కాగా బీసీ రిజర్వేషన్ ఓటర్ జాబితా ప్రకారం చేపడుతారా లేదా అన్నది ఇంకా సృష్టం చేయాల్సి ఉంది.

కొడంగల్ నియోజకవర్గంలో..

గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉండటంతో కొండగల్ నియోజకవర్గంలో ఎక్కువ గా ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులే సర్పంచులు గా గెలిచారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకర్గంలోని అన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఇప్పటి నుంచే నాయకులు నిమగ్నమయ్యారు.