23 June, 2026 | 7:45 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

సాయి ప్రియా కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

03-04-2026 06:48 PM

రూ.9 కోట్ల డ్రైనేజీ పనులకు ఆమోదం

కాలనీ వాసుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో రూ. 9 కోట్లలతో  డ్రైనేజీ పనులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఈ కాలనీ అభివృద్ధి కోసం యుద్ద ప్రాతిపదికన నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.

శుక్రవారం కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... అనేక సంవత్సరాలుగా సాయి ప్రియ కాలనీ అభివృద్ధికి నోచుకోలేదని పాలకుల వివక్షకు గురైందని దానిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి కాలనీలో కావాల్సిన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, మంచి నీటి కనెక్షన్ లాంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 9 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు.