22-05-2025 01:32:54 AM
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు బుధవారం ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌పై సునీతారావు తీవ్ర ఆరోపణలు చేశారు.
పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా, వారి సొంత మనుషులకే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమిస్తున్నారంటూ ఆమె వ్యా ఖ్యానించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిం ది. పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేర కు నోటీసులు జారీఅయ్యాయి. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కాంగ్రెస్ ఆదేశించింది.