16-06-2025 02:03:41 AM
- రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- వారం రోజులలో రైతులకు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు జమ
- తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, జూన్ 15 (విజయ క్రాంతి):ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమ లు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నా రు.ఆదివారం మంత్రి తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
బచ్చోడు గ్రామంలో బచ్చోడు నుండి ఉర్లగొండ డొంక వరకు 3 కోట్ల 15 లక్షలతో, రాజారాం గ్రామంలో రాజారాం నుండి జూపెడ వరకు 2 కోట్ల 42 లక్షలతో నిర్మించనున్న 2.2 కిలోమీటర్ల పొడవు బీటీ రోడ్డు పనులకు, సోలిపురం గ్రామంలో సోలిపురం నుండి హలావత్ తండా వయా దర్గా వరకు కోటి 83 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి సోలిపురం గ్రామంలో ఉన్న హజ్రత్ మన్సూర్ షావలి దర్గాను దర్శించుకొని చాదర్ సమర్పించారు.
కాకరవాయి గ్రామంలో పీక్యా తండా నుండి కాకరవాయి వరకు 3 కోట్ల 15 లక్షలతో నిర్మించనున్న 3 కిలో మీటర్ల మేర బీటి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ చ్చోడు నుంచి ఉర్లగొండ డొంక వరకు 3.2 కిలో మీటర్ల మేర 3 కోట్ల 15 లక్షలతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసుకున్నామని, 4 రోజులలో పని ప్రారంభించి, ప్రస్తు త సీజన్ ముగిసే లోపు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
బచ్చోడు గ్రామం లో ఇప్పటి వరకు 6 కోట్ల విలువైన అభివృ ద్ధి పనులు పూర్తి చేసామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ప్రభుత్వం గత పాల కుల సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుం టూ వస్తున్నామని అన్నారు. 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత గృహ విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బ స్సు, ఆరోగ్య శ్రీ పథకం పరిమితి 10 లక్షలకు పెంపు, గురుకులాల్లో డైట్ చార్జీలు 40 శా తం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంపు, సన్న వడ్లకు క్వింటాల్ 500 రూపాయల బో నస్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్నబి య్యం పంపిణీ, నూతన రేషన్ కార్డుల జా రీ,ఇందిరమ్మ ఇండ్ల వంటి అనేక సంక్షేమ కా ర్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నా రు.
గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి క్రింద 10 వేల రూపాయలు అందిస్తే, ఇందిరమ్మ ప్రభు త్వం 12 వేల రూపాయలను రైతుల ఖా తాలో జమ చేస్తుందని, రాబోయే వారం రోజుల్లో రైతు భరోసా నిధులు జమ అ వుతాయని అన్నారు. మన ఇందిరమ్మ ప్రభు త్వం మొదటి 10 నెలల్లో 21 వేలకోట్ల రూ పాయలు రుణమాఫీ పూర్తి చేశామని అన్నా రు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధు లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఎస్‌ఇ వెంక ట్ రెడ్డి, టి.జి.ఎన్.పి.డి.సి.ఎల్. ఎస్‌ఇ శ్రీనివాసా చారి, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, తిరుమలాయపాలెం మండల ఎంపీడీఓ సిలార్ సాహెబ్, తహసీల్దార్ విల్సన్, అధికారులు, తదితరులుపాల్గొన్నారు.
అభివృధి పధకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి:మంత్రి పొంగులేటి
ఖమ్మం/తిరుమలాయపాలెం, జూన్ 15 (విజయ క్రాంతి):కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృధి పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో జరిగిన జై బాపు... జై భీమ్.... జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.గత ప్రభుత్వా లు చేయని అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.