16-06-2025 02:01:17 AM
ఖమ్మం, జూన్ 15( విజయ క్రాంతి): జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజి శాసనమండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులిపాటి వెంకయ్య, శ్రేణులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో టి పి సి సి సభ్యులు జిల్లా ఓబీసీ సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజెండ్ల సాయికుమార్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,జిల్లా సేవాదళ్ అద్యక్షులు సయ్యద్ గౌస్, జిల్లా ఆర్ టి ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, జిల్లా కాంగ్రెస్ నాయకులు కూరపాటి కిషోర్ మరియు సుమారు 30 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రక్తదానం చేసినారు.
అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజి శాసనమండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, జిల్లా ఐ యన్ టి యు సి అద్యక్షులు కొత్తా సీతారాములు, జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా ఎస్ సి సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య,కార్పొరేటర్లు దుద్దుకూరి వేంకటేశ్వరరావు,లకావత్ సైదులు నాయక్, రాపర్తి శరత్ కుమార్, కన్నం వైష్ణవిప్రసన్నకృష్ణ , మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు మరియు శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ చేసి,మిఠాయిలు పంచి సంబురాలు చేసినారు.
అనంతరం వారు మాట్లాడుతూ....ప్రజా నాయకులు బడుగు బలహీన వర్గాల అబివృద్ధి ప్రదాత భట్టి విక్రమార్క అని అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపనే ద్యేయంగా ఆహర్నిశలు శ్రమిస్తున్న శ్రామికుడు భట్టి విక్రమార్క అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ రషీద్,మద్దినేని రమేష్,నూకరపు వేంకటేశ్వరరావు, కమతం రామకృష్ణ, జిల్లా ఓబీసీ సెల్ ఉపాద్యక్షులు బమ్మిడి శ్రీనివాస్ యా దవ్, గజ్జి సూర్యనారాయణ,నగర ఓబీసీ సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్, నగర మైనారిటీ అద్యక్షులు షేక్ అబ్బాస్ భేగ్, మాజి యం పి టి సి నల్లమోతు లక్ష్మయ్య,యూసఫ్, రజ్జీ,మహమూద్, మున్నా, జహీర్ భాయ్, సాదే శంకర్, యాసబోయిన శ్రీశైలం, బెజ్జం గంగాధర్, జాని, గోపాల్ , ముజాహిద్దీన్, రమణ, విప్లవ కుమార్ పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.