calender_icon.png 12 November, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం

12-11-2025 06:37:00 PM

అలంపూర్: విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. బుధవారం గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి డిజిటల్ స్క్రీన్ల ద్వారా బోధించే పాఠ్యాంశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

యు డైస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, పాఠశాల నిధులను నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టాలన్నారు.పాఠశాల తరగతి గదిలోనే అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తుండడంతో త్వరలోనే కేంద్రానికి పక్కాభవనం నిర్మించాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు. పాఠశాలలో గ్రంథాలయ, సమాచార, క్రమశిక్షణ, ఆరోగ్య, ఫుడ్ కమిటీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నెలలోగా ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి కలెక్టర్ మొక్క నాటారు. ఈ పర్యటనలో విద్యాశాఖ ఏపిఓ శ్రీనివాసులు, పాఠశాల జిహెచ్ఎం మద్దిలేటి, పంచాయతీ సెక్రెటరీ రజియా బేగం, తదితరులు పాల్గొన్నారు.