12-11-2025 06:27:51 PM
నిర్మల్ (విజయక్రాంతి): స్నేహితుని భార్యను అపహరించి లైంగిక దాడి చేసిన కేసులో బుధవారం ఇద్దరు నేరస్తులకి 20 ఏళ్ల జైలు శిక్ష, ఐదేళ్ల జరిమానా విధిస్తూ నిర్మల్ జిల్లా ప్రిన్సిపల్ & సెషన్స్ జడ్జి శ్రీమతి ఎస్. శ్రీవాణి తీర్పు వెల్లడించినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం తెలిపారు. ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు 2017 సంవత్సరంలో ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 376(D), 366 r/w 34 IPC సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగిందన్నారు.
వివరాలు..
డండుగుల ధర్మపురి S/o నర్సయ్య, వయస్సు 20 సంవత్సరాలు, కులం: వడ్డెర, వృత్తి: వ్యవసాయం, నివాసం: పాత ఎల్లాపూర్ (వి), ఖానాపూర్ మండలం. కుంచెపు గంగాధర్ S/o గంగారం, వయస్సు 20 సంవత్సరాలు, కులం: వడ్డెర, వృత్తి: కూలీ, నివాసం: పాత ఎల్లాపూర్(వి), ఖానాపూర్ మండలంకు చెందిన ఇద్దరు వ్యక్తులు మహిళను అపహరించి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు రుజువు కావడంతో శిక్ష పడిందని తెలిపారు. ఇద్దరు నిందితులకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ, ఒక్కొక్కరికి రూ.5,000/- జరిమానా, మొత్తం రూ.10,000/- విధించినట్లు శ్రీమతి ఎస్. శ్రీవాణి, ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి, నిర్మల్ తీర్పు ఇచ్చారు.
ఎస్పీ మాట్లాడుతూ... సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ కూడా శిక్ష నుండి తప్పించుకొలేరని తెలిపారు. నిర్మల్ పోలీసులు, ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి ఖచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు. పోలీసు శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ, న్యాయస్థానాల ద్వారా శిక్షలు పడటానికి తగిన సాక్షులను న్యాయస్థానాలలో ప్రవేశపెట్టడానికి నిర్మల్ పోలీసులు కృషి చేస్తున్నారు. నిందితుడి శిక్ష పడడంలో కృషిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. వినోద్ రావు, విచారణ అధికారులు ఏ.అశోక్, డ్యూటీ ఆఫీసర్స్ ASI డల్లు సింగ్, ప్రభాకర్ HC, రాజ శేఖర్ PC లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.