1 May, 2026 | 4:08 AM

ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తున్నాం

01-05-2026 02:40 AM
  1. ఆందోళ్‌ను హెల్త్ హబ్‌గా అభివృద్ధి
  2. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
  3. డాకూర్‌లో ఉచిత హెల్త్ క్యాంప్ ప్రారంభం

ఆందోల్(సంగారెడ్డి), ఏప్రిల్ 30(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని, ఆందోల్ ను హెల్త్ హబ్గా మారుస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ తెలిపారు. ఆందోల్ మండలం డాకూర్ గ్రామంలో ధర్మశాస్త్ర ఫౌండేషన్ - సహార హాస్పిటల్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా  మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. క్యాన్సర్, డయాలసిస్, గుండె సంబంధ , ఎన్సీడీ చికిత్సలను కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నామన్నారు.  డాకూర్ గ్రామానికి చెందిన ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

హైదరాబాదులో క్యాన్సర్ నివారణ కోసం సహారా ఆస్పత్రిలో గ్రామానికి చెందిన సాహసం రాష్ట్ర అధ్యక్షులు, సామాజిక కార్యకర్త డాక్టర్ ముప్పారం ప్రకాశంను పరామర్శించడం జరిగిందన్నారు. సామాజిక కార్యకర్త ముప్పారం ప్రకాశం  క్యాన్సర్ చికిత్సకు సహారా ఆసుపత్రిలోని వైద్యులు సరైన చికిత్సను అందించడంతో ప్రకాశం త్వరగా కోలుకున్నారన్నారు.

సహారా ఆసుపత్రి వారు డాకూర్  గ్రామంలో మెడికల్ క్యాంపు పెట్టి ప్రజల ఆరోగ్య స్థితిగతులను స్క్రీనింగ్ చేయడాన్ని మంత్రి స్వాగతించారు.  సంగారెడ్డి డిఎంహెచ్‌ఓ వసంత్ కుమార్,  ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు.