1 May, 2026 | 4:07 AM

అంబిటస్ స్కూల్ టాపర్‌కు సన్మానం

01-05-2026 02:43 AM

 588 మార్కులతో స్కూల్ టాపర్ రాందేని వర్షశ్రీని అభినందించిన పాఠశాల యాజమాన్యం

సిద్దిపేట, ఏప్రిల్ 30: పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి స్కూల్ టాపర్గా నిల్చిన  విద్యార్థిణిని రాందేని వర్షశ్రీ ని పాఠశాల యాజమాన్యం గురువారం అభినందించారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామానికి చెందిన రాందేని గణేష్ సత్తవ్వ దంపతులు పట్టణంలోని రాంనగర్లో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరి చిన్న కూతురు రాందేని వర్షశ్రీ జిల్లా కేంద్రం సిద్దిపేటలోని అంబిటస్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసింది.

బుధవారం వెలువడిన పది ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించి వర్షశ్రీ స్కూల్ టాపర్గా నిలిచింది. దీంతో పాఠశాల యాజమాన్యం ఎడ్ల జ్యోతిరెడ్డి, ఎడ్ల శ్రీనివాస్రెడ్డిలు విద్యార్థినిని పాఠశాలలో గురువారం శాలువాతో సన్మానించి, అభినందించారు. అదేవిదంగా పాఠశాలలో 550కి పైగా 35మంది, 500 మార్కులకు పైగా 76మంది విద్యార్థులు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు.

సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను, విద్యార్థులను అభినందించారు. స్కూల్ ఫస్ట్ వచ్చేలా తనకు సహకరించిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులకు వర్షశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ విజయ్భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.