14-01-2026 07:31:50 PM
-నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేయడం దుర్మార్గం
-బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్
హనుమకొండ,(విజయక్రాంతి): బీసీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును బీసీ జేసి ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీవీ ఇన్ ఫుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరియు రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ లతో పాటు మరో జర్నలిస్ట్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. మహిళ ఐఏఎస్ ను డీఫేమ్ చేసిన కేసులో మరియు మంత్రి వార్త వ్యవహారంలో బీసీ జర్నలిస్టులపై ప్రభుత్వం కక్షగట్టి అరెస్టు చేసి, ఇప్పటివరకు అరెస్టు చూపకపోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
అదేవిధంగా ఛానల్ యజమాన్యం సీఈవో పైన కూడా కేసులు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నట్లు తెలియ వచ్చిందని, ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులపై అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే బేషరతుగా వదిలిపెట్టాలని, ప్రభుత్వ విధానాలను మార్చుకోకపోతే బీసీ సమాజమంతా తిరగబడుతుందని హెచ్చరించారు. అక్రమ అరెస్టులు చేసిన జర్నలిస్టులపై ఇలాంటి కేసులు పెట్టకుండ వెంటనే విడుదల చెయ్యాలని ప్రభుత్వన్ని డిమాండ్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ చేశారు.