calender_icon.png 14 January, 2026 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గృహజ్యోతి సర్టిఫికెట్ల పంపిణీ

14-01-2026 07:34:24 PM

బేల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే ప్రతి ఇంటికి నాణ్యమైన ఉచిత కరెంట్ అందించడం జరుగుతోంది. బుధవారం మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఏఈ సంతోష్, సర్పంచ్ భాగ్యలక్ష్మితో కలిసి గృహజ్యోతి లబ్ధిదారులకు సర్టిఫికెట్స్ లను అందజేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... ముందగా గ్రామ ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

గృహజ్యోతి లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు బేల గ్రామ పంచాయతీలో మొత్తం 1,920 విద్యుత్ మీటర్లు ఉండగా అందులో రెండు వందల యూనిట్ల లోపు వాడే లబ్ధిదారులకు సర్టిఫికెట్లను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందులో తనకు కూడా గృహజ్యోతి పథకం వర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ తో ప్రతి నిరుపేద కుటుంబానికి దాదాపుగా ఐదు వందల నుండి ఎనిమిది వందలు రూపాయలు మిగులుతుందన్నారు. ఈ మిగిలిన డబ్బులను ప్రతి ఒక్కరు పిల్లల చదువు వారి భవిష్యత్ కోసం ఉపయోగించాలని కోరారు.