calender_icon.png 5 May, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాడింది మేము.. దొరలకు ఉద్యమ ఫలాలు

04-05-2025 12:09:43 AM

మేం రక్తం చిందించి తెలంగాణ తీసుకొస్తే.. దొరలకు రాజభోగాలు: ఉద్యమకారుడు వీరన్న

తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఎందరో అమరులయ్యారు. మలిదశ ఉద్యమంలో తొలి అమరురాలు బెల్లి లలిత స్ఫూర్తితో ప్రజలు ఉవ్వెత్తున పోరాడారు. అయితే, ఆ పోరాట ఫలితాలను కొందరు దొరలే అనుభవించారు. బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగింది’ అని అంటున్నారు తెలంగాణ ఉద్యమకారుడు మేకల వీరన్న. తెలంగాణ జనసభలో చేరిన ఆయన 1997 నుంచే ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. కేసీఆర్ కంటే ముందే ఆయన అనేక పోరాటాలు చేశారు.

హుస్నాబాద్ వినియోగదారుల మండలి, డోలుదెబ్బ, గొల్ల కురుమ సామాజిక సంస్థ, గొల్ల కురుమ మేధావుల ఫోరం, వరద కాలువ సాధన సమితి, బీసీ రిజర్వేషన్ల మండల్ ఉద్యమంలో ఆయన ప్రజల పక్షాన నిలబడ్డారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ హుస్నాబాద్ చైర్మన్‌గా, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్‌గా, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ర్ట కమిటీ సభ్యుడిగా అవిశ్రాంతంగా పోరాడారు.

అఖిల భారత యాదవ మహాసభ, తెలంగాణ విద్యావంతుల వేదిక వంటి అనేక ప్రజా సంఘాల్లో కీలకంగా పనిచేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారు. ఈ పోరాటాల్లో ఆయన అనేక కేసులు ఎదుర్కొన్నారు. అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత, బీఆర్‌ఎస్ పాలనలో బలహీన వర్గాలకు సరైన గుర్తింపు లభించలేదని వీరన్న వాపోతున్నారు. “మేము కష్టపడి, రక్తం చిందించి సాధించుకున్న తెలంగాణలో దొరలే ఓనర్లుగా చలామణి అవుతున్నారు.

పదేండ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సరైన వాటా దక్కలేదు” అని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు గొర్లు, బర్రెలు, చేపలు, కుండలు, సెలూన్లు, దళితబంధు, బీసీ బంధు వంటి పథకాలు తెచ్చి బీసీలను రాజ్యాధికారానికి దూరం చేశారని అభిప్రాయప డ్డారు. పేద ప్రజలను, కార్యకర్తలను చులకనగా చూశారంటున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులను పోలీసులుతో కొట్టించి అక్రమ కేసులు బనాయించారని ఆవేదన చెందారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తాను ఏడాది క్రితమే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశానని వీరన్న తెలిపారు. “నాలాంటి ఉద్యమకారులు, బడుగులు నిర్మించిన బీఆర్‌ఎస్‌లో ఎప్పటికీ ఓనర్లు కాలేమని, అధికారాన్ని అందుకోలేమని గ్రహించాను. అందుకే నేను  కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలి పాను” అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాడిన వీరన్న వంటి వారి ఆవేదన.