మాకు లీకేజీ నీరే దిక్కు !

24-04-2024 01:54:09 AM

మేడ్చల్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : అప్పుడు సమయం దయం 11.38 గంటలు అవుతుంది. అప్పటికే మాడ పగిలేలా ఎండ కొడుతుంది. ఓ అవ్వ రోడ్డుపై లీక్ అంపతున్న నీటిని ఓ లోట సాయంతో బకెట్‌లో పోగు చేసుకుంటుంది. ఇంత ఎండలో ఎందుకు మురికి నీరు జమ చేసుకుంటావని అడిగితే.. మాకు ఆ లీకేజీ నీరే దిక్కన్నది. నగ రంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న నీటి కొరతకు అద్దం పట్టేలా ఉన్న ఈసంఘటన జవహర్‌నగర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ముందు ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.