12 May, 2026 | 2:26 AM

గెలుపు పక్కా

12-05-2026 01:15 AM
  1. ప్రధాని సభను ప్రజలు ఆశీర్వదించారు 
  2. మోదీ ఇచ్చిన ఉత్సాహంతో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు 
  3. బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): నాన్‌పొలిటికల్ సీజన్‌లోనూ ప్రధాని మోదీ బహిరంగ సభను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారని, ఆ ఉత్సాహంతో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. అధికారమే సంకల్పంగా ప్రజా వ్యతిరేక విధానాలపై తాము పోరాడుతామని ఆయన చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడుతూ.. తెలంగాణ సమాజంలోని ప్రతివర్గం బీజేపీ వైపు ఆశతో చూస్తోందని అన్నారు.

దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజలు మద్దతు ఇస్తున్న తరహాలోనే తెలంగాణలో కూడా రాజకీయ మార్పు అనివార్యమవుతోందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వం తెలంగాణ లో కొత్త రాజకీయ దిశను తీసుకురాబోతోందని, రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయంగా అవతరించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక, మహిళా వ్యతిరేక, యువత వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తోందని విమర్శించారు.

రాష్ట్రంలో గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పూర్తిగా విస్మరించిందన్నారు. మోదీ గ్యారంటీ అంటే తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర ఆర్థిక పురోగతి అని స్పష్టంచేశారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై బీజేపీ ఉద్యమ పంథాలో పోరాటం కొనసాగిస్తుందని, కార్యకర్తలు అధికారం లక్ష్యంగా మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసంచేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందని ఆరోపించారు.

ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై జరుగుతున్న విమర్శలను ఖండించిన ఆయన, ఇది భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతున్న సాధారణ ప్రక్రియ మాత్రమేనని చెప్పారు. దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్ల తొలగింపే లక్ష్యమని, అసలైన ఓటర్ల హక్కులకు భంగం కలగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని విమర్శించిన రాంచందర్‌రావు.. ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలి.. కానీ కాంగ్రెస్ పార్టీ తనను తాను ముస్లిం లీగ్ తరహా పార్టీగా మార్చుకుంటోంది అని పేర్కొన్నారు.

దేవాలయాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎస్‌ఐఆర్ బీజేపీ చేసేది కాదని, రో హింగ్యాలు, దొంగ ఓట్లతో ఇప్పటివరకు బెం గాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఎస్‌ఐఆర్‌తో దొంగ ఓట్లు పోయా యి తప్పితే అసలు ఓట్లు తొలగించలేదని స్పష్టంచేశారు. తెలంగాణలో కమలం వికసించే దిశగా ప్రజల ఆశీర్వాదం బీజేపీకి లభి స్తోంది అని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరే డ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన తెలంగాణ ప్ర జలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

సభకు తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున తరలివచ్చారని, ఇంతటి జనసంద్రం కనిపించడం తెలంగాణలో బీజేపీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు. సాధు సమాజం నుంచి స్వామీజీలు, బం జారా, లంబాడీ సమాజాల మహిళలు, డాక్ట ర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, న్యా యవాదులు, యువత, మహిళలు పెద్ద సం ఖ్యలో పాల్గొనడం సభను ఒక మహోత్సవంలా మార్చిందని తెలిపారు. 

పార్టీకి సంబంధం లేదు..

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి బండి భగీరథపై నమోదైన కేసు వ్యవహారం బీజేపీకి సంబంధం లేదని, ఇది కేవలం బం డి సంజయ్ వ్యక్తిగత కుటుంబ వ్యవహారమని రాంచందర్ రావు పేర్కొన్నారు. బండి సంజయ్ తమ నాయకుడు.. ఆయన కేంద్రమంత్రి అన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

అసలేం జరిగిందనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు. ఈ వివాదాన్ని రాజ కీయంగా వాడుకోవడాన్ని ఆయన ఖండించారు. ఆ అంశంలో బండి సంజయ్ కుటుం బీకుల జోక్యం ఏమైనా ఉంటే దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని కోరారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిజానిజాలను బయటపెట్టాలన్నారు.