10-02-2026 12:27:26 AM
ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
నల్గొండ టౌన్, ఫిబ్రవరి 9: విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి ఎం జి యూవీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్. అన్నారు ప్రకృతి, వైజ్ఞానికత, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే నినాదంతో, విజ్ఞాన దర్శిని సంస్థ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా సాగుతున్న ప్రకృతి విజ్ఞాన యాత్ర సోమవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి చేరుకుంది. ఎం జి యు సెమినార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రతి విద్యార్థి హేతుబద్ధత వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చు కోవాలని పిలుపునిచ్చారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం, లోతైన పరిశీలన, సామాజిక అన్వయింపు ద్వారా శాస్త్రజ్ఞులుగా రూపొంది దేశ సేవ చేయవచ్చన్నారు. అనంతరం కవి, వాగ్గేకారుడు, ఉద్యమకారులు జయరాజ్ మాట్లాడుతూ మానవాళి మనుగడ ప్రకృతితో మమేకమై సయోధ్యతో మెలిగినప్పుడే సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ప్రకృతి స్పృహ కలిగి ప్రకృతి అనుకూలమైన జీవన విధానాన్ని అలవర్చు కోవాలి అన్నారు.
కృతజ్ఞతా పూర్వకంగా జీవించడం, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించినప్పుడే ప్రకృతి సమతుల్య సాధ్యమవుతుందన్నారు. రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలు, హక్కులతో పాటు బాధ్యతలను సైతం ప్రతి పౌరుడు గుర్తెరిగి ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు అధ్యాపకులతో ప్రకృతి- రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు. విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ మాట్లాడుతూ మానవ మనుగడ వైజ్ఞానిక ఆవిష్కరణలపై ఆధారపడి ఉందన్నారు. అనేక సవాళ్లను సైన్స్ పరిష్కారాలు చూపి మానవ మనుగడ సుగమం చేసిన ఉదంతాలను ఆయన విద్యార్థులకు వివరించారు.
మహనీయుల త్యాగ ఫలాలను రాబోవు తరాలకు బాధ్యతగాఅందించాల్సినగురుతరబాధ్యతవిశ్వవిద్యాలయాలపై అన్నారు. ప్రతి విద్యార్థి జాతీయ భావాలతో, స్వలాభాలను వదిలి సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యే అవకాశాలు ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా సాధ్యమని, ఈ కార్యక్రమాల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని పిలుపునిచ్చారు. గంజి ఈశ్వర లింగం నేత్రదానం, రక్తదానం ప్రాముఖ్యతను విద్యా ర్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శని రాష్ట్ర ప్రతినిధి సురేష్ కుమార్, స్వరాజ్యం, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా మారం వెంకటరమణారెడ్డి, డా జక్క సురేష్ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డా షరీఫ్, డా కిరణ్ మై, రమేష్ నాయక్, తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.