14 May, 2026 | 1:14 AM

రైతులకు నష్టం కలగకుండా చూడాలి

14-05-2026 12:00 AM

గోదాంలో ఉన్న నిల్వలను వెంటనే తరలించాలి 

ఎమ్మెల్యే మాణిక్ రావు 

జహీరాబాద్, మే 13 : రైతులకు నష్టం కలవకుండా మక్కలను త్వరితగతిన కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు కోరారు. బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ తో కలిసి జహీరాబాద్ పట్టణంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల నుండి మక్కలను శరవేగంగా కొనుగోలు చేసి వారికి డబ్బులను సకాలంలో చెల్లించాలని సూచించారు సంబంధిత అధికారులతో మాట్లాడి గోదాంలో దాదాపుగా 6000 బస్తాల పైనే మక్కలు ఇతర ప్రాంతాలకు తరలించకపోవడం దారుణమన్నారు.

రైతు డిక్లరేషన్ పేరుతో రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారని, రైతులు దాదాపు 20 నుండి 30 రోజుల వరకు ధాన్యాన్ని మార్కెట్లో వేసుకొని ఉండవలసిన పరిస్థితి ఏర్పడడంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే మక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్ మండలాల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, నర్సింలు, సర్పంచ్ మచ్చేందర్, శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.