విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి
13-08-2026 01:23 AM
గద్వాల టౌన్, ఆగస్టు 12 (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్లో ఏఐఎస్‌ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఏఐఎస్‌ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బి. ఆంజనేయులు జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మతోన్మాదం, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరికీ ఉచిత, నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






