అలంపూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
13-08-2026 01:25 AM
అలంపూరు, ఆగస్టు 12 (విజయక్రాంతి): వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన అలంపూరు మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని అలంపూరు డెవలప్మెంట్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం తహశీల్దార్ ప్రభాకర్ ,అగ్రికల్చర్ ఏడీ సుబ్బారెడ్డి ఏఓ నాగార్జున రెడ్డిలకు వినతిపత్రం సమర్పించారు. మండలంలో పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, కరువు పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతో పాటు ఉపాధి హామీ పనులను విస్తృతం చేయాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.






