13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలి

31-03-2026 12:00 AM

మున్సిపల్ చైర్మన్  డాక్టర్ కోడి శ్రీనివాసులు

చండూరు, మార్చి 30 : మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న హెచ్ పి వీ వ్యాక్సిన్ కేంద్రాన్ని సోమవారం నాడు చండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా  మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ వ్యాక్సిన్కు వేల రూపాయలు ఖర్చవుతుండగా, ప్రభుత్వ ఆసుపత్రులలో దీనిని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

చండూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మాస రాజు మాట్లాడుతూ, 14 నుంచి 15 ఏళ్ల వయస్సు గల బాలికలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో హెచ్పివి వ్యాక్సిన్ వేయనున్నట్లు వివరించారు. అర్హులైన బాలికలు తమ ఆధార్ కార్డు ఫోటోకాపీని సమర్పించి, అన్ని పనిదినాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా తీసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్యా బ్లెస్సి, సూపర్వైజర్ ఝాన్సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది రజిని, మెహబూబి, మంగమ్మ  మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.