13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గ్రామ, వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు

31-03-2026 12:00 AM

కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్, మార్చి 30 (విజయక్రాంతి) : ప్రజాపాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 02వ తేదీన గ్రామ పంచాయతీలలో నిర్వహించనున్న గ్రామ సభలు, మున్సిపాలిటీల లో నిర్వహించనున్న వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి అనంతరం అధికారులకు పలు అంశాలపై కలెక్టర్ కీలక సూ చనలు చేశారు.

ముందస్తుగానే గ్రామ/వార్డు సభల వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని, పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లతో సమావేశమై తగు సూచనలు చేయాలన్నారు. గ్రామ సభలు నిర్వహించే ప్రదేశాలలో తగిన నీడ, తాగునీరు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎండ తీవ్ర త దృష్ట్యా ఉదయం 7.30 నుండి 10.30 గంటల లోపు సభలు నిర్వహించాలని సూ చించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ లు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సభలలో అవగాహన కల్పించడంతో పాటు, ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొం దుతున్న లబ్దిదారులతో వారి అనుభవాలను తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా గ్రామ, వార్డు సభల విజయవం తానికి కృషి చేయాలన్నారు.

ఇదిలాఉండగా, పదవ తరగతి పరీక్షా కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసిల్దార్లకు కలెక్టర్ సూచించారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సాఫీగా జరిగేలా  చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ 

నిజామాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ప్రారంభించారు. వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు వీలుగా తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓ ప్రతినిధులు కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అని అన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయానికి వచ్చే వారికి ప్రస్తుత వేసవిలో అంబలి కేంద్రం ఉపశమనాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు.