మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి
10-08-2026 02:09 AM
ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్
మహబూబాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): దేశం కోసం, అక్కడకు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషిచేసిన మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ పిలుపునిచ్చారు. సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో అంబేద్కర్, పూలే, బాబు జగ్జీవన్ రాం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్‌ఎప్‌ఐ జాతీయధ్యక్షుడు డాక్టర్ వివేక్, ప్రముఖ న్యాయవాది నలమాస కృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ నెహ్రూనాయక్, నూకల అభినవ్ రెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లాఅధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






