calender_icon.png 29 July, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మసకబారుతున్న ప్రభుత్వ విద్యను కాపాడాలి

24-07-2025 12:00:00 AM

- ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలను ఆధునికరించాలి

- కనీస మౌలిక సదుపాయలపై ప్రభుత్వం దృష్టి సారించాలి

- యుద్ధ ప్రాతిపదన ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలి

భద్రాద్రి కొత్తగూడెం, జులై 23,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్య మసకబారుతుందని దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని, ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠ శాలలు నేడు వెలవెలబోతున్నాయని, విద్యార్థులు బడిబాట పట్టాలంటే సమస్యల పరి ష్కారమే మార్గమని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని తక్షణ మే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాల కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి భయ్యా అభిమన్యు పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కా ర్యదర్శి జె. గణేష్, పిడిఎస్యు జిల్లా సాయ కా ర్యదర్శి బి.నరేందర్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే షాహిద్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షు లు శ్యామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల చేపట్టిన బంద్ లో భాగం గా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ సంపూర్ణమైంది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూప్రభు త్వ పాఠశాల కళాశాలలో మౌలిక వసతులు కల్పన లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇ బ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయితే విద్యార్థు లు తీవ్ర ఇ బ్బందులుకు గురికావాల్సి వస్తుందని, ప్రభు త్వ విద్యపై తల్లిదండ్రులలో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత  ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాల, కళాశాల వి ద్యార్థులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించి, ఉపాధ్యాయ, లెక్చరర్స్ ని యామకాలు చేపట్టాలనీ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యపై దృష్టి సారించి ప్రభుత్వ విద్య వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం,ప్రభుత్వ వి ద్య రంగంపై దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలను కళాశాలను ఆధునికరించాలి అని ప్ర భుత్వాన్ని కోరారు.నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యా ర్థి సంఘాల నాయకులు  ఏఐఎస్‌ఎఫ్ నా యకులు గుండాల సుజన్ సంజయ్ వినయ్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రెస్వాత్ వినీల్ పి డి ఎస్‌యు నాయకులు భార్గవ్. గంగాధర గణేష్ పాల్గొన్నారు.