calender_icon.png 29 July, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కుడి కాలువకు నీటి విడుదల

24-07-2025 12:00:00 AM

నకిరేకల్ జులై 23(విజయకాంత్రి): నార్కెట్పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా దిగువకు  బుధవారం అధికారులతో కలిసి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన   మాట్లాడుతూ.  ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక బ్రాహ్మణ వెల్లాంల పూర్తి కావడం సంతోషకరమన్నారు.జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నేడు నీటిని విడుదల చేశామని తెలిపారు.

ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత శరవేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని ఆయనతెలిపారు.గోపాలయిపల్లి, నార్కెట్పల్లి, యడవల్లి, ఎపి లింగోటం చెర్వులను ఈ నీటితో నింపుతామని తెలిపారు..రైతుల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం నార్కట్ పల్లి బస్ డిపోలో నూతన పనులు చేసిన మూడు బస్సులును ఆయన ప్రారంభించారు..

రాష్ట్ర ప్రభుత్వం మహిళలు గౌరవిస్తూ ఉచిత ప్రయాణం నిర్వహించడం హర్షించదగ్గ విషయం అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య,మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య, డిఈ శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి రాములు తదితరులు పాల్గొన్నారు.