పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి
జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
బోయినిపల్లి: ఆగస్టు 26( విజయ క్రాంతి ): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కోరారు. బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం సూచనల మేరకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మండల ఉపాధ్యక్షులుగా గుడి శ్రీనివాస్ రెడ్డి, చంద్రగిరి ప్రేమ్, జనరల్ సెక్రటరీ గా నిమ్మ భరత్ రెడ్డి, కత్తెరపాక శ్రీనివాస్, సనా సత్యం, సార్ల వసంత మరియు సెక్రటరీ లు గా 6 గురు అదేవిధంగా ఎక్జ్యూటివ్ మెంబర్స్ గా 9 మంది ని మొత్తం 21 మంది మండల్ కమిటీ సభ్యులు నియ మించారు. ఈ నూతన కమిటీకి సంబంధించిన నియామక పత్రాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సువీన్ యాదవ్కు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీని వాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మండల స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నూతన కమిటీ సభ్యులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా స మస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని అన్నారు.






