28-10-2025 01:31:45 AM
ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్
ఉప్పల్, అక్టోబర్ (విజయక్రాంతి): విద్యతోపాటు నిత్యం జరుగుతున్న నేరాలపై విద్యార్థులకు అవగాహన ముఖ్యమని ఉప్ప ల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో భాగంగా సోమవారం ఉప్పల్ పోలీస్ స్టేష న్ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మారకద్రవ్యాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతల సమాజ రక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు అమరవీరుల పౌర సమాజం నివాళులర్పిస్తుందన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని ఆయన విద్యార్థులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.