15-10-2025 08:35:45 PM
ఉప్పల్ (విజయక్రాంతి): గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సబ్ ఇన్స్పెక్టర్ మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన విశాల్ కుమార్ గత కొంతకాలంగా గంజాయి అమ్మకాలు చేపడుతున్నారని పక్కా సమాచారంతో నాచారంలోని దుర్గా నగర్ స్మశానా వాటికి వద్ద విశాల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుండి 250 గ్రామ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.