సమన్వయంతో పనిచేయాలి
ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి
నారాయణఖేడ్, జూలై 10: అధికారులు నాయకులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ లోని కన్వర్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ సర్పంచులు పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గ్రామాల్లో ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు తగువిధంగా కృషి చేస్తామని అన్నారు.
పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో ఉండి పార్టీలకు అతీతంగా గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, డిపిఓ మల్లారెడ్డి, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, డి ఎల్ పి ఓ సుధాకర్ రెడ్డి ఆయా మండలాల అధికారులు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఉప సర్పంచు లు పాల్గొన్నారు.






