19 August, 2026 | 3:52 AM

సమన్వయంతో పనిచేయాలి

19-08-2026 12:00 AM

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

మిడ్జిల్, ఆగస్టు 18: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని  ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ స మావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.  ప్రజల కు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల పరిస్థితి, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.