తెలంగాణలో అధికారమే లక్ష్యంగా క్రమశిక్షణతో పని చేయాలి
04-06-2026 01:48 AM
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
సుల్తానాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేయాలని ఎమ్మెల్సీ చిన్న మల్ అంజిరెడ్డి అన్నారు, బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సాయపల్లి గ్రామంలో గల ఒక ఫంక్షన్ హాల్ లో బిజెపి పెద్దపల్లి జిల్లా ప్రశిక్షణ శిబిరం సమావేశం జరిగింది.
సమావేశానికిముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ చిన్నమల్ అంజిరెడ్డి పాల్గొని కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేశారు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో జిల్లా, మండల నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...






