కుక్కల బారిన నవజాత శిశువు!
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఘటన
అచ్చంపేట, జూన్ 3(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఓ నవజాత ఆడ శిశువు మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో పడేయడం.. శిశువు శరీర భాగాలు కుక్కలు పీక్కుతిన్న దారుణ సంఘటన బుధవారం ఉదయం స్థానికులను కలచివేసింది.పట్టణంలోని విద్యానగర్ కాలనీలోనీ గౌతమి స్కూల్ వెనుక భాగంలోని కంపచెట్ల పొదల్లో నవజాత శిశువు మృతదేహం గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.
రెండు రోజుల క్రితం శిశువు జన్మించినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిశువు ముఖాన్ని శునకాలు, పందులు ఛిద్రం చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.ఘటన స్థలంలో శిశువు మృతదేహాన్ని చూసిన స్థానికులు ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలోనో ఇతర ప్రాంతాల్లో జననం తర్వాత ఇక్కడ పడేసినట్లుగా అనుమానిస్తున్నారు.ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఓ అమ్మాయి సాక్ష్యంగానే శిశువును ముళ్లపొదల్లో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిశువు మృతదేహాన్ని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






