11-02-2026 12:00:00 AM
అమెరికా, భారత్ మధ్య ఇటీవలే జరిగిన వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు లాభదాయకమని ప్రకటించడం మంచి పరిణామమే అయినప్పటికీ, ఆ ఒప్పందాలు భరోసానిచ్చేవిగా ఉంటే ఉత్త మం. వాస్తవానికి మనపై సుంకాల శాతం 18 శాతానికి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, కొంతమేర లాభకరమైనప్పటికీ.. భవిష్యత్తులో మాత్రం భారత్ వ్యవసాయ ఉత్ప త్తులకు, రైతాంగానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయని స్పష్టంగా చెప్పవచ్చు.
వాణిజ్య ఒప్పందం పేరుతో అమెరికా.. చిరకాల మిత్రుడు రష్యా నుంచి మనల్ని దూరం చేసే ప్రయ త్నం చేస్తుందని పలువురు మేధావులు పేర్కొనడం సముచితమే. అయితే అమెరికాతో వాణిజ్య ఒప్పందం లోతుల్లోకి వెళ్ల డానికి ముందు ఒక విషయాన్ని ఉదాహరణగా చెప్పాల్సిన అవసరముంది. గత దశాబ్దం మొదట్లో ‘జియో’ ఫ్రీ డేటా, అన్ లిమిటెడ్’ అంటూ నెట్‌వర్క్ సామ్రాజ్యం లో ప్రవేశించి అప్పటికే బలంగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, ఐడియా వంటి సంస్థలకు నష్టం కలిగిస్తూ, దేశంలో దాదా పు మూడో వంతు వినియోగదారులను తనవైపు తిప్పుకుంది.
తీరా ఇప్పుడు అదే జియో నెట్‌వర్క్ వినియోగదారులను ఎం తలా బాదుతుందో అందరికీ తెలిసిందే. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ద్వారా ఇప్పటికిప్పుడు భారతదేశ రైతంగానికి, వ్యవసాయానికి ఎలాంటి నష్టం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాబోయే కాలంలో మన దేశీయ ఉత్పత్తుల స్థానం లో అమెరికా వస్తువులు ఆక్రమించేందుకు ఆస్కారముంది. దీంతో నేటికి భారత్‌లో 60 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు అతలాకుతలమయ్యే అవకాశం ఉందని గ్రహించాలి.
చిక్కులే ఎక్కువగా..
ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఇటీవలే వెనిజులాను అమెరికా ఏ ఉద్దేశంతో ఆక్రమించిందనేది అందరికీ తెలిసిదే. వెని జులాలో ఉన్న చమురు నిక్షేపాలను కొల్లగొట్టి ఇతర దేశాలకు అమ్మడం ద్వారా లాభపడడంతో పాటు ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదగాలన్నదే వారి తాపత్ర యం. అంతేకాదు చమురు నిల్వలకు కేం ద్రంగా ఉన్న రష్యా వద్ద చమురు కొనుగోలును భారత్ సహా ఇతర దేశాలు ఆపాల నేది అమెరికా కుటిల పన్నాగాలు చేసింది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌ను తమవైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించింది.
అందులో నుంచి పుట్టిందే ఈ వాణిజ్య ఒప్పందం. వాణిజ్య ఒప్పందం ఖరారు చేసుకునే నేపథ్యంలో భారత్ ఇక పై తమ వద్దనే చమురు కొంటుందని, రష్యా వద్ద కొనుగోలు చేయడం ఆపేసిందంటూ అమెరికా తమకు తాముగా ప్రక టన చేసుకోవడం ఆశ్చర్యపరిచింది. ము ఖ్యంగా తమ ఎదుగుదలకు అడ్డుపడుతు న్న రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయాలన్నదే అమెరికా ఎత్తుగడ.
ఈ నేపథ్యంలోనే రష్యాతో సఖ్యతగా మెలిగే దేశాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభిం చింది. ఇక రెండో పార్శం చూసుకుంటే.. భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడంలో అమెరికా జాప్యం చేయ డం కూడా మనకే కలిసొచ్చింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి బ్రేక్ పడిన సమయంలోనే భారత్ వరుసగా బ్రిటన్, యుఏఈ, యూరోపియన్ యూనియన్ సహా చాలా దేశాలతో వాణిజ్య ఒప్పందా లు, ఎఫ్‌టీఏలతో దూకుడు పెంచింది.
ఇ ప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలో ఉన్న భారత్ తాజా ఒప్పందాలతో ఆర్థిక శక్తిలో మరింత పైకి ఎదిగే అవకాశం ఉందని అమెరికా పసిగట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌తో వ్యా పారం చేసేందుకు అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి.
ఈ అవకాశాన్ని వదులు కోవద్దని భావించిన ట్రంప్ ఒక అడుగు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గి, 50 శాతమున్న సుంకాలను 18 శాతానికి పరిమి తం చేసి కొత్త వ్యూహాలకు తెరతీశారు. అమెరికాతో కొత్తగా చేసుకున్న వాణిజ్య ఒప్పందంలో మన ఎగుమతులపై సుంకా లు తగ్గించినట్లే తగ్గించి, మనం దిగుమతి చేసుకునే వస్తువులపై మాత్రం ఎలాంటి మార్పులు లేకపోవడం భారత్‌ను చిక్కుల్లో పడేసే అంశంగా గమనించాలి.
అధ్యయనం చేయాలి..
అమెరికాతో -భారత్ వాణిజ్య ఒప్పం దం ఖరారయిన వెంటనే మన కేంద్ర మం త్రి పీయూష్ గోయల్ భారత వ్యవసాయ రంగానికి, రైతాంగ రక్షణకు ఢోకా లేదని పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఈ వాణి జ్య ఒప్పందం అమెరికాకు అనేక రకాలు గా లాభదాయకంగా ఉంటుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ప్రక టించారు. మరో పక్క అమెరికా వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ సైతం అమె రికా ఉత్పత్తులను భారీ ఎత్తున భారత్ కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.
కానీ ఈ ఒప్పందం వల్ల భవిష్యత్తులో భారతలో వ్యవసాయ, రైతాంగానికి నష్టం వాటిల్లుతుందన్న విషయం స్పష్టంగా అర్థమవు తుంది. ఏది ఏమైనా భవిష్యత్తులో భారత్ ‘వికసిత్ భారత్’గా మారాలన్నా కేవలం వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం కాదని గ్రహించాలి.
అమెరికాతో ఒప్పం దం వల్ల వీటో పవర్ ఉన్న మన మిత్రుడు రష్యా ఇప్పటికిప్పుడు దూరం కాకపోయినప్పటికీ, తాజా చర్యలు భవిష్యత్తులో మన దేశం ఇబ్బందులు ఎదుర్కోక తప్ప దు. ఆసియా దేశాలైన చైనా, వియత్నాం కంటే అమెరికా మన నుంచి కేవలం 18 శాతం సుంకాలే వసూలు చేస్తుందని వ సూలు చేస్తుంది అని సంబరం పడటంకన్నా భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామా లను కూలంకషంగా అధ్యయనం చేయాల్సిన అవసరముంది. కొంతమేరకు ఈ ఒ ప్పందాలు వాణిజ్యం పరంగా ఉపయుక్తం గా ఉన్నా, ప్రజల జీవితాల్లో, జీవన ప్రమాణాలకు భరోసానివ్వాలి.
ముఖ్యంగా మన దేశం విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలి. అందరి కీ ఆరోగ్యం అందాలి. నేటికీ గిరిజన ప్రాం తాల్లో డోలీలే ఉన్న పరిస్థితులున్నాయి. సరైన రోడ్డు సదుపాయాలు లేవు. చివరికి శ్రీక్రష్ణ జన్మస్థలం గోకులం వంటి పర్యాటక ప్రదేశాలలో ఉన్న రోడ్లు, డ్రైనేజీ పరి స్థితి అత్యంత హీనంగా ఉంది.
బలోపేతం అవసరం..
దేశంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. దేశ రాజధాని ఢిల్లీ తరచూ వాయుకాలుష్యంతో ప్రమా ద ఘంటికలు మోగిస్తుంది. దేశంలో చాలా ప్రాంతాల్లో నేటికీ కనీస వసతులైన మంచినీళ్లు, బాలికలు ఉన్నత విద్య లేకపోవడం, మహిళలపై అఘాయిత్యాలు, బాల్య వివాహాలు, వరకట్నాలు, పరువు హత్యలు పెరగడంతో పాటు అవినీతి, బంధుప్రీతి తారాస్థాయికి చేరుకుంది.
నాలుగు జాతీ య రహదారులు (ఎక్స్‌ప్రెస్ హైవేలు), ఆరు పెద్ద పెద్ద విమానాశ్రయాలు, కొన్ని వందల ఎతైన విగ్రహాలు ఏర్పాటు, పది పోర్టులు నిర్మాణం చేయడం ద్వారా వికసిత్ భారత్ సాధ్యం కాదు. నేటికీ ఎనభై శాతం భారత జనాభా వివిధ ఉచిత, సంక్షే మ పథకాల పైనే ఆధారపడి బతుకులు వెళ్లదీస్తుండడంతో దేశం తలసరి ఆదా యం తక్కువగానే ఉంది. నైపుణ్యలేమి, నిరుద్యోగం పెరిగిపోయి యువత కొట్టుమిట్టాడుతుంది.
అధిక ధరలు, ద్రవ్యోల్బణంతో సామా న్య, మధ్య తరగతి వర్గం అతలాకుతలం అవుతోంది. ఎగుమతులు తక్కువగా ఉం డడం, దిగుమతులు పెరిగిపోవడం ఆందోళనకరం. సుమారు 140 కోట్ల జనాభా కలిగిన భారత్ మార్కెట్‌ను వదులుకోవ డం ఇష్టం లేకనే అమెరికా మనతో వాణి జ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందనిపిస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి.
అంతర్జాతీయంగా మన మార్కెట్‌ను దూరం చేసు కోవ డానికి ఏ దేశం ఇష్టపడడం లేదు. దీనిని ఉపయోగించుకుంటూ మన పాలకులు విదేశీ పాల కుల వద్ద దౌత్య ప్రతిభ కనబరచాల్సిన అవసరముంది. మనకు నష్టం కలగని రీతిలో ఒప్పందాలు చేసుకోవాలి. విద్యా, వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవడం, వ్యవసాయ పారిశ్రామిక రంగాలను బలోపేతం చేయ డం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది.
వ్యాసకర్త సెల్: 9390509791