08-07-2025 12:00:00 AM
వరంగల్ (మహబూబాబాద్), జూలై 7 (విజయక్రాంతి): యువత పరిశోధన, అభివృద్ధికి సిద్ధంగా కొత్త పరిశోధన మైలురాళ్లను నిర్దేశిస్తున్నారని, సమాజ సేవకు ముందుకు రావాలని గవర్నర్, కాకతీయ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. కేయూ 23వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా నిర్వ హించారు. గవర్నర్ హాజరై వివిధ ఫ్యాకల్టీ, పీహెచ్‌డీ అభ్యర్థులకు పట్టాలు, వివిధ సబ్జెక్టుల్లో మొదటి ర్యాంక్ పొందిన వారికి గోల్డ్ మెడల్స్‌ను ప్రదానం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయం ఉత్తర తెలంగాణాలోనే ఒక మహత్తర విద్యా కేంద్రం గా అభివృద్ధి చెందిందన్నారు. న్యాక్ ఎ+ గ్రేడింగ్, 151 బ్యాండ్ ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్, దేశంలోనే మూడవ యూఐ గ్రీన్ మెట్రిక్, జాతీయ స్థాయిలో ఫార్మసీ కళాశాల 84వ ర్యాంకింగ్ ఇవన్ని విశేష విజయాలు అని చెప్పారు. ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాల మెరుగుద లకు అనుగుణంగా కృత్రిమ మేధా,
మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సు, న్యూట్రిషన్ సైన్సు కోర్సులు కాకతీయ యూనివర్సిటీలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హైదరాబా ద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ సంచాలకులు, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత డాక్టర్ డీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య కే ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.