08-07-2025 12:00:00 AM
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్ఠం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ నేతల మధ్య సమన్వయం చేయడానికి పీసీసీ అధ్యక్షుడు ఉమ్మడి పది జిల్లాలకు సోమవారం ఇన్‌చార్జులను నియమించారు. ఆ తర్వాత జిల్లాల ఇన్‌చార్జులతో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మీనాక్షినటరాజన్ మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టాలని, అందుకు వెంటనే పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌లు రంగంలోకి దిగాలని ఆదేశించారు. కాగా, ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను టీ పీసీసీ నియమించిన విషయం తెలిసిందే.
జిల్లాల వారిగా ఇన్‌చార్జులు
ఖమ్మం సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్‌రెడ్డి, నల్లగొండ ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, వరంగల్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మెదక్ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహబూబ్‌నగర్ పీఏసీ సభ్యులు కుసుమ కుమార్, ఆదిలాబాద్ ఎంపీ అనిల్ యాదవ్, కరీంనగర్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నిజామాబాద్ వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మత్ హుస్సేన్, రంగారెడ్డి శాట్ చైర్మన్ శివసేనారెడ్డి.