12 May, 2026 | 3:42 PM

సెల్లార్ నిర్మాణాలను అడ్డుకున్న మున్సిపల్ సిబ్బంది

12-05-2026 02:39 PM

అక్రమ నిర్మాణాలపై "బుల్డోజర్" పాదం

మాజీ కౌన్సిలర్ ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం

తాండూరు,(విజయక్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ నిర్మాణాలపై వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ అధికారులు మంగళవారం బుల్డోజర్ తో కూల్చి వేశారు. పట్టణ పరిధిలోని వార్డ్ నెంబర్ 20 గాంధీనగర్లో  మున్సిపల్ అనుమతులు లేకుండా  ఓపెన్ ప్లాట్ యజమాని సెల్లార్ నిర్మించేందుకు భారీ గుంతను తొవ్వారు. దీంతో పరిసర గృహల బేస్మెంట్ కదలడం, మట్టి, రాళ్లు  కూలుతూ ప్రమాదకర స్థాయికి చేరింది.

ఈ విషయమై స్థానిక మాజీ మున్సిపల్ కౌన్సిలర్, బిఆర్ఎస్ నాయకురాలు సంగీత ఠాగూర్ స్థానికులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.  క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన మున్సిపల్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భారీ సెల్లార్  గుంతను బుల్డోజర్ సహాయంతో నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ పాదంతో చర్యలు తీసుకోవడంతో మున్సిపల్ కమిషనర్, సిబ్బందిని స్థానికులు అభినందిస్తున్నారు.