calender_icon.png 5 July, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనమహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయాలి

05-07-2025 12:00:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

హాజీపూర్ (మంచిర్యాల), జూలై 4 (విజయక్రాంతి) : వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామపంచాయతీ పరిధిలో గల కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో వన మహోత్సవం- 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసా ద్, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు సహజ సిద్ధమైన వాయువును అందించేందుకు ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. జిల్లాలోని ఆయా శాఖలకు మొక్కలు నాటేందుకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అధికారులు సమ న్వయంతో కృషి చేయాలని తెలిపారు.

అనంతరం మంచిర్యాల పట్టణంలోని పాతమంచిర్యాల ప్రాంతంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా భవన్ నిర్మాణ పనులను సందర్శించారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇందిరా మహి ళా భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.