లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
చిట్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థి, విద్యార్థినీలకు విద్యాభ్యాసంలో ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో మంగళవారం సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల అధ్యక్షుడు రవీందర్ గౌడ్ జనగాం సౌజన్యంతో నిర్వహించారు. చిట్యాల పట్టణంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందజేసి వారి విద్యా ప్రయాణానికి తోడ్పాటు అందించారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని లయన్స్ క్లబ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు మాధవరెడ్డి పాటి, ప్రధాన కార్యదర్శి నరసింహ రేగులగడ్డ, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు రంగా, సతీష్ కంబంపాటి, మహేందర్ రెడ్డి నల్ల, ఎల్లయ్య కోనేటి పాల్గొన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.






