calender_icon.png 8 May, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయాలకతీతంగా సైనికులకు అండగా నిలవాలి..

08-05-2025 12:00:00 AM

వైరా, మే 7 (విజయక్రాంతి): పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భారత ప్రధాని మోడీ సారధ్యంలో  ఆపరేషన్ సింధూ ర్ పేరుతో సైనికులు యుద్ధం ప్రారంభించి విజయవంతం చేశారని, భారత దేశ పౌరులంతా రాజకీయాలకతీతంగా సైనికులకు అండగా ఉండి మన ధైర్యం కల్పించాలని బిజెపి జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు . 

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరు తో యుద్ధం విజయవంతమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి   దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో  ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భం గా జై జవాన్ జై కిసాన్ అంటూ జాతీయ ప తాకాలతో  బిజెపి జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు  ప్రదర్శన చేపట్టి కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. దేశ క్షేమం కోరుతూ సైనికులకు మనోధైర్యం క ల్పించాలని  ప్రధాని మోడీ నాయకత్వంలో సైనికులు చేపట్టిన యుద్ధం విజయవంతం కావాలని బిజెపి జాతీయ నాయకుల పొం గులేటి సుధాకర్ రెడ్డి  ఆకాంక్షించారు.

పొంగులేటి ప్రత్యేక పూజలు..

వైరా శాస్త్రినగర్ లోని  షిరిడి సాయిబా బా దేవాలయంలో ప్రత్యేక పూజలు. హో మం  మహా అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని   పర్యాటక ప్రాంతంలో భారతీయులను పాకిస్తాన్ ఉగ్రవాదులు  దాడులు చేసి కాల్చి  చంపటం బా ధాకరమన్నారు.

దానికి ప్రతీకారంగా  పాకిస్తాన్ దేశంపై  భారత ప్రధాని మోడీ సారధ ్యంలో  సైనికులు యుద్ధం ప్రారంభించి ఆపరేషన్ సక్సెస్ చేశారన్నారు.  దీనికి ఇండియా పౌరులుగా  సైనికులను అభినందించాలన్నా రు. ఈ కార్యక్రమంలో  బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు జిల్లా నాయకు లు నన్నే ఉదయ ప్రతాప్   బిజెపి నాయకులు వెంకటకృష్ణ నరేష్ మండల నాయకు లు కార్యకర్తలు పాల్గొన్నారు.