07-05-2025 11:25:12 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హుల ఎంపికపై ప్రజల్లో ఉన్న అభ్యంతరాలను స్వీకరణకు బుధవారం చివరిరోజు కావడంతో పలువురు పుర కమిషనర్ రాజుకు అభ్యంతరాలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హుల జాబితాల్లో చేర్చిన అనర్హుల పేర్లను తొలగించాలంటూ పలువురు బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు రామిడి ఉమాదేవి, జీలకర మహేష్ లు పుర కమిషనర్ కు అభ్యంతరపరిచారు. గతంలో విడుదల చెందిన జాబితాలో తమ వార్డుకు చెందిన నిరుపేదల పేర్లు జాబితాల్లో ఉండగా, ప్రస్తుతం విడుదల చేసిన జాబితాల్లో వారి పేర్లను కొందరు కాంగ్రెస్ నాయకులు తొలగించి అనర్హులైన వారి పేర్లను చేర్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే దీనిపై స్పందించి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని కోరారు.
గడువు పెంచిన అధికారి
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హుల జాబితా ఎంపికపై ప్రజల నుండి ఉన్న అభ్యంతరాలు రావడంతో గడువును మరో రెండు రోజులు పొగిస్తున్నట్లు పుర కమిషనర్ రాజు తెలిపారు.