calender_icon.png 18 December, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త తరహా చిత్రాలను ఆదరించాలి

17-12-2025 01:17:57 AM

నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డార్క్ కామెడీ కథతో, సరికొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మాతలు. ఈ నెల 19న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబో తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. “గుర్రం పాపిరెడ్డి’లో నేను ముఖ్యమైన రోల్ చేశా.

ఈ చిత్రాన్ని ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా కొత్త పద్ధతిలో దర్శకుడు తెరకెక్కించాడు. కొత్త వాళ్లు చేసిన ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది” అన్నారు. ‘ఈ చిత్రంలో లీడ్ రోల్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఇందులో మూడు నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కూడా కనిపిస్తాన’ని హీరో నరేశ్ అగస్త్య తెలిపారు. ఫరియా మాట్లాడు తూ.. “ఒక డిఫరెంట్ డార్క్ కామెడీ చిత్రమిది. కృష్ణ సౌరభ్ పాటలు, బీజీఎంతో సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లారు.

ఈ చిత్రంలో నేను ఒక సాంగ్ రాసి పాడి కొరియోగ్రాఫ్ చేశాను” అని తెలిపింది.  డైరెక్టర్ మాట్లాడుతూ.. “తెలుగు ఆడియెన్స్‌కు ఒక కొత్త తరహా సినిమా చూపించాలనే అందరం ఎఫర్ట్స్ పెట్టాం. కొత్త తరహా సినిమా అని ఎక్కడా మన నేటివిటీ దాటి వెళ్లలేదు” అని చెప్పారు. నిర్మాత అమర్ బురా మాట్లాడుతూ.. “మా సినిమా బాగా రావడానికి కారణం మా డైరెక్టర్. ఈ సినిమాతో మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని మొదటి నుంచి చెప్పినట్లే ట్రైలర్‌తో నిరూపించాడు. మా కాంబినేషన్ జర్నీ ఆగదు” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.