2 May, 2026 | 1:09 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

ధర్తీ ఆభా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

19-06-2025 12:21 AM

ఐటీడీవో పీవో బి.రాహుల్

బూర్గంపాడు, జూన్18 (విజయక్రాంతి): మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల లో నివసించే గిరిజన కుటుంబాల సౌకర్యా ర్థం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ధర్తీ ఆభా యోజన అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, గిరిజనులు సద్విని యోగం చేసుకోవాలని ఐటిడిఏ పీవో బి.రా హుల్ అన్నారు. బుధవారం మండలంలోని కృష్ణ సాగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధర్తీ ఆభా యోజన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు.

కార్యక్రమానికి వచ్చిన ఐటీడీఏ పీవో రాహుల్ ను గ్రామస్తులు గిరిజన సాంప్రదాయ ప్రకారము ఘనంగా స్వాగతం పలికారు. అనంత రం ధర్తీ ఆబా యోజన గ్రామ సభకు వచ్చిన గిరిజనులకు గ్రామ సభలో అధికారులు చేపడుతున్న కార్యాచరణ, గిరిజనులకు అందిస్తు న్న వివిధ రకాల కార్డుల గురించి ఆయన వారికి వివరించారు.

అనంతరం ఆయన మా ట్లాడుతూ ధర్తీ ఆభా యోజన పథకం కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 130 గ్రామపంచాయతీలను ఎంపిక చేయడం జరిగిం దని, ఆ గ్రామ పంచాయతీలలో కృష్ణ సాగ ర్ ఉందని తెలిపారు.

ప్రతి మనిషికి తప్పనిసరిగా ఆధార్ కార్డు,కుల ధృవీకరణ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు,రేషన్ కార్డు,కిసాన్ సమ్మన్ నిధి యోజన,ఆయుష్మాన్ భారత్, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు,జన్ ధన్ కార్డులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ మొదలగునవి అర్హులైన ప్రతి గిరిజనులకు అందిస్తారని, వీటి వలన ప్రభుత్వం నుంచి రావలసిన ఏ పథకాలైన సులభం గ్యాస్ పొందవచ్చు అన్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డులు జారీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేసినందున ప్రతి ఒక్క గిరిజన కుటుంబాలు తమపేర్లు నమోదు చే సుకొని కావలసిన కార్డులు పొందాలన్నారు. సంబంధిత అధికారులు కుటుంబంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా వారికి కావలసిన కార్డులు రిజిస్ట్రేషన్ చేసి అందజేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ బాలయ్య, ఎంఏఓ కృష్ణయ్య, డా క్టర్ లక్ష్మి,ఏవో శంకర్, ఏపీవో విజయలక్ష్మి, ఆర్‌ఐ నరసింహులు, ఏపీఎం నాగార్జున, బ్యాంకు ఫీల్ ఆఫీసర్ లక్ష్మణ్, మీసేవ నిర్వాహకులు నాగేశ్వరరావు, గ్రామస్తులు తదిత రులు పాల్గొన్నారు.